ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.131 కోట్ల విలువైన వైద్య సేవలు: విప్ విజయరమణరావు
విశ్వంభర, పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.131.62 కోట్ల విలువైన వైద్య సేవలు అందించినట్లు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు తెలిపారు. మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వివిధ వార్డులను పరిశీలించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేళ్లలో ఆసుపత్రికి రూ.40 లక్షలతో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడంతో పాటు, రూ.50 లక్షల వ్యయంతో ఎస్‌ఎన్‌సీయూ ను ఏర్పాటు చేసి నవజాత శిశువులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో 2,081 ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, 6,478 జనరల్ సర్జరీలు, 3,096 కంటి శుక్లాల ఆపరేషన్లు, 5,067 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అలాగే వేలాది మంది రోగులకు స్కానింగ్, ఈసీజీ, ల్యాబ్ పరీక్షలు, ఇతర వైద్య సేవలు ఉచితంగా అందించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని రూ.52 కోట్లతో 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నందున ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.