మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా వలిగొండ మాజీ ఎంపీపీ దివంగత తుమ్మల నరసయ్య కుమారుడు తుమ్మల శ్రీనివాస్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, దివంగత తుమ్మల నరసయ్య సేవా సమితి సభ్యులు, అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు విజ్ఞప్తి చేశారు.