కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు 

విశ్వంభర, వరంగల్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాలు ఐక్యంగా పోరాడాలని ఏఐకేఎంకేఎస్ జాతీయ అధ్యక్షుడు కామ్రేడ్ సింహాద్రి ఝాన్సీ పిలుపునిచ్చారు. మంగళవారం వరంగల్‌లో అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య (న్యూ), తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగం, పేదరికం, సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని విమర్శించారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సదస్సుకు ఏఐఎఫ్‌టీయూ (న్యూ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మోడం మల్లేశం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో గుర్రం విజయ్‌కుమార్, ప్రసాద్, కేమిడి ఉప్పలయ్య, బుర్ర ఆనంద్, ఈర్ల పైడి, సోమిశెట్టి దశరథం, వల్లాల కిషోర్, పల్లెబోయిన స్వామి, భైరబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/united-struggles-against-anti-labour-and-peasant-policies/article-20181

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్