అర్హులైన ఓటర్లందరూ వెంటనే దరఖాస్తులు సమర్పించాలి: ఎమ్మార్వో చిన్నప్పల నాయుడు
విశ్వంభర, మహేశ్వరం: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం గడువు ఆగస్టు 3తో ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఓటరు ఆలస్యం చేయకుండా దరఖాస్తు ఫారాలు సమర్పించాలని మహేశ్వరం తహసీల్దార్ (ఎమ్మార్వో) చిన్నప్పల నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, బీఎల్‌వోలు, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని ఆయన సమీక్షించారు. ఇంకా దరఖాస్తులు సమర్పించని అర్హులైన ఓటర్లను గుర్తించి, వారితో వెంటనే ఫారాలు నింపించి సంబంధిత బీఎల్‌వోలకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గడువు చివరి రోజు వరకు వేచి ఉండకుండా సమీప బీఎల్‌వో వద్ద నుంచి దరఖాస్తు ఫారాలు తీసుకుని అవసరమైన వివరాలు పూర్తి చేసి వెంటనే సమర్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు నమోదైన ఎస్‌ఐఆర్ పురోగతిని కూడా ఆయన వెల్లడించారు. సరూర్‌నగర్‌లో 42.16 శాతం, సరూర్‌నగర్ సర్కిల్-12లో 37.44 శాతం, బడంగ్‌పేట్ సర్కిల్-16లో 44.26 శాతం, బాలాపూర్‌లో 55.69 శాతం, జల్‌పల్లి సర్కిల్-17లో 58.18 శాతం, మహేశ్వరంలో 75.92 శాతం, కందుకూరులో 86.61 శాతం నమోదు అయినట్లు తెలిపారు. తక్కువ నమోదు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌ఐలు రాజిరెడ్డి, విశ్వనాథ్‌తో పాటు మండలంలోని సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.