“మన శంకర వరప్రసాద్ గారు” సినిమా సక్సెస్.. మెగా విక్టరీ సెలబ్రేషన్స్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.
విశ్వంభర, సినిమా బ్యూరో: సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మెగాస్టార్ నివాసంలో గ్రాండ్ సక్సెస్ మీట్, సంక్రాంతి వేడుకలను నిర్వహించింది.
ఈ సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ సక్సెస్ సంబరాల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి కేక్ కట్ చేశారు. సినిమా ఘన విజయం సాధించినందుకు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెలతో పాటు పలువురు సన్నిహితులు హాజరయ్యారు.
సంక్రాంతి పండుగకు కావాల్సిన పూర్తిస్థాయి వినోదం ఈ సినిమాలో ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చిరంజీవి మార్క్ కామెడీ, అనిల్ రావిపూడి మేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. వెంకటేష్ కీలక పాత్రలో మెరవడం ప్రేక్షకులకు డబుల్ ధమాకాగా మారింది. పండగ సెలవులు కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.



