తెల్లవార్లూ అదే పని.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు..

తెల్లవార్లూ అదే పని.. శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు..

 

శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె సౌత్ ఇండియాలో ఎంత ఫేమస్ హీరోయిన్ అనేది అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు సౌత్ లో సినిమాలు తగ్గించింది. సౌత్ లో స్టార్ డమ్ ఉండగానే బాలీవుడ్ కు చెక్కేసింది. ఇప్పుడు అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటోంది. 

అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ మీమ్ ను పోస్ట్ చేసింది. ఇందులో ఏముందంటే.. అందరూ రాత్రి పూట పడుకుంటే తాను మాత్రం రీల్స్, మీమ్స్ షేర్ చేస్తుంటానని తెలిపింది. తెల్లవార్లు మూడు గంటల దాకా తాను ఇలా రీల్స్, మీమ్స్ తన ఫ్రెండ్స్ కు షేర్ చేస్తుంటానని వివరించింది. 

ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోంది. ఇక కొంత కాలం క్రితమే ఆమె తన బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికతో బ్రేకప్ చేసుకుంది. ఆ బాధనుంచి బయటకు రావడానికే ఆమె ఇలాంటి మీమ్స్ పోస్టు చేస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో రెండు సినిమాలతో పాటు ప్రభాస్ సలార్-2లో నటిస్తోంది.