చిరు సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

చిరు సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.

image (30)విశ్వంభర బ్యూరో: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. జనవరి 11న సాయంత్రం 8 గంటల నుంచి రాష్ట్రంలో స్పెషల్ ప్రీమియర్ షోలకు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. దీనికి టికెట్ రేటును రూ.600గా నిర్ణయించింది. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్స్‌లలో సాధారణ టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి రూ.100 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవడానికి కూడా సర్కార్ వెసులుబాటును కల్పించింది.

మరోవైపు మన శంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సినిమా విడుదలకు ముందు రోజున జనవరి 11న ప్రీమియర్స్ వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ప్రీమియర్స్ టికెట్ ధర రూ.500గా నిర్ణయించింది. జనవరి 12 నుండి పదిరోజుల పాటు సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.100, మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.125గా నిర్ణయించింది. అంతే కాకుండా రోజుకు ఐదు షోలు వేసకునేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది.

Read More సర్పంచ్ ఎన్నికలలో యువకుల జోరు

Tags: