ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్
On
విశ్వంభర, సరూర్ నగర్ :-లింగోజిగూడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఇంటర్ స్కూల్ కబడ్డీ టోర్నమెంట్ బుధవారం నిర్వహించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రెసిడెంట్ శ్రీ జైపాల్ రెడ్డి , డైరెక్టర్ ఆలాపాటి శైలజ కామేశ్వర్ రావు అకాడమిక్ డైరెక్టర్ బాలాజీ ప్రారంభించారు. సుమారు 20 స్కూల్స్ నుండి 45 టీమ్స్, మరియు 350 మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు. సాయంత్రం విజేతల కు డైరెక్టర్ కామేశ్వర్ రావు ట్రోఫీలు షీల్డ్స్ తో పాటు రోలింగ్ షీల్డ్ కూడా అందజేశారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తీ పెంపొందిoచాడానికి ఈ టోర్నమెంట్ లు ఎంతగానో ఉపయోగపడుతాయనితెలియజేశారు. ప్రిన్సిపల్ రామారావు మాట్లాడుతూ ఈ యొక్క ఆట పోటీలకు అనుకున్న టీం ల కన్నా ఎక్కువ టీమ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పిఇటీ సూరారం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించగా .అండర్ 17 బాలురు మాస్టర్ మైండ్స్ గెలుపొందగా, అలియా నిర్మల్ స్కూల్ బాలికల కప్ గెలుచుకున్నారు.అండర్ 14, మరియు అండర్ 12 లలో విజేతలు గా కృష్ణవేణి టాలెంట్ స్కూల్, లింగోజిగూడ బ్రాంచ్ గెలిచింది,.ఈ టోర్నమెంట్ ఇంత విజయవంతం కావడానికి సహకారం అందించిన అందరికి ప్రిన్సిపాల్ రామారావు మరియు నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.



