ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు

ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు

విశ్వంభర, హైదరాబాదు : ఆక్రమణల కారణంగా వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ భూములు, నాలాలు, పార్కులను పరిష్కరించాలంటూ సోమవారం హైడ్రా ప్రజావాణికి 54 ఫిర్యాదులు అందాయి. మహేంద్రహిల్స్, మేడ్చల్, రాజేంద్రనగర్, జవహర్‌నగర్, మల్కాజిగిరి, సూరారం, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఆక్రమణల వల్ల వరద నీటి ప్రవాహం నిలిచిపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, పార్కుల కబ్జాలు, రహదారుల ఆక్రమణలను వెంటనే తొలగించాలని కోరారు. మేడ్చల్‌లో కాలనీ వరదనీటి కాలువలను ప్రధాన కాలువకు అనుసంధానం చేయాలని, రాజేంద్రనగర్‌లో నాలాపై అక్రమ నిర్మాణాలు తొలగించాలని, జవహర్‌నగర్, సూరారం, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని, మల్కాజిగిరిలో రహదారి ఆక్రమణను తొలగించాలని వినతిపత్రాలు సమర్పించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/complaints-to-hydra-about-invasions/article-17389

Tags: