ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం... మను బాకర్ సరికొత్త రికార్డ్

ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం... మను బాకర్ సరికొత్త రికార్డ్

ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో కాంస్యం
దక్షిణ కొరియాతో పోటీ పడి నెగ్గిన మనుబాకర్, సరబ్ జ్యోత్
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మనుబాకర్ రికార్డ్

Manu-Bhaker-Sarabjot-Singh ప్యారిస్ , విశ్వంభర :- ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో మను బాకర్, సరబ్ జ్యోత్ సింగ్ జోడీ కాంస్యాన్ని నెగ్గారు. దక్షిణ కొరియాతో పోటీ పడి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. మను బాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా, దక్షిణ కొరియా జోడి 10 పాయింట్లు మాత్రమే సాధించారు.

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించి మనుబాకర్ రికార్డ్ సృష్టించారు. స్వతంత్ర భారతంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మొదటి క్రీడాకారిణి మనుబాకర్. ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఇప్పుడు మిక్స్డ్ ఈవెంట్‌లోనూ పతకం సాధించారు.

Read More ఆమెలోనే ఏదో లోపం.. కర్ణాటక హైకోర్టు ఆగ్రహం

Tags: