బంగ్లాదేశ్‌లో మరో హిందువు దారుణ హత్య..!!

బంగ్లాదేశ్‌లో  మరో హిందువు దారుణ హత్య..!!

విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి.

విశ్వంభర, నేషనల్ తెలంగాణ బ్యూరో:  బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి. గత మూడు వారాల వ్యవధిలోనే పది మందికిపైగా హిందువులు హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలో మరో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

తాజాగా రాజ్‌బరి జిల్లాలో ఒక హిందూ యువకుడు దారుణంగా హతమయ్యాడు. పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపుకున్న తర్వాత డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోతున్న వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడన్న కారణంతో, అతడిని వాహనంతో ఢీకొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని 30 ఏళ్ల రిపోన్ సాహాగా గుర్తించారు.

Read More WHOకు అమెరికా ‘గుడ్‌బై’

రిపోన్ సాహా రాజ్‌బరిలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం అక్కడికి వచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) రాజ్‌బరి జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ తన కారులో పెట్రోల్ నింపించుకున్నాడు. అనంతరం డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన రిపోన్ అతడిని ఆపేందుకు ముందుకు వెళ్లగా, హషేమ్ తన కారును అతనిపైకి నడిపించాడు. ఈ ఢీకొనడంతో రిపోన్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని, అబుల్ హషేమ్‌తో పాటు అతని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Tags: