ఘనంగా కార్తీక వన భోజన సమారాధన మహోత్సవం. 

-పాల్గొన్న రాపోలు వీరమోహన్

ఘనంగా కార్తీక వన భోజన సమారాధన మహోత్సవం. 

విశ్వంభర, హైద్రాబాద్:- రంగారెడ్డి జిల్లా ఆల్మాస్ గూడ మున్సిపల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన భోజన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు  రాపోలు వీర మోహన్ హాజరై మాట్లాడుతూ పద్మశాలీలు అందరూ ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమం లో సంఘం అధ్యక్షులు శ్రీ రామదాసు, తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకు మల్లయ్య, ఉపాధ్యక్షురాలు సామల స్వప్న, మనోహర్,ఆర్గనైజింగ్ సెక్రటరీ పబ్బతి మాధవి, కోశాధికారి జెల్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

Tags: