పాతబస్తీలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
విశ్వంభర / చంద్రాయన గుట్ట :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ నముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా చంద్రాయన గుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో రెయిoబో హోమ్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బోయ నగేష్ ఆధ్వర్యంలో శనివారం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రెయిo బో హోం లోని బాల బాలికలతో కలిసి కేక్ కట్ చేశారు . అనంతరం బాలికలకు బిస్కెట్స్, పండ్లు పంచారు. పాఠశాలల చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిహెచ్ఎంసి సిబ్బందికి పిలిచి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచాలని నేటి బాలలు రేపటిభావి భారత పౌరులని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అజీజ్ చంద్రాయన గుట్ట వైస్ ప్రెసిడెంట్, కరీం, అమీర్ బిన్ జియాద్, సయ్యద్ రషీద్, అబ్దుల్లా, బి మధుమోహన్, శ్రీకాంత్ గౌడ్, సందీప్, మహమ్మద్ వహీద్ ఖాన్, నర్సింహ, అజీజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



