ఎన్నికల్లో ఓడినా ఆదరణ కోల్పోలేదు - మాజీ ఎంపీటీసీ మమతా భూపతిరెడ్డి - దండు సరితా రాజుకు చేయూత
విశ్వంభర,:-చేవెళ్ల మండల పరిధిలోని బస్తేపురం గ్రామానికి చెందిన దండు సరితా రాజు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. పేద రైతు కుటుంబానికి చెందిన ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిలో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చాన్వెల్లి మాజీ ఎంపీటీసీ మమతా భూపతిరెడ్డి తక్షణమే స్పందించి దండు సరితా రాజుకు రూ.20వేల ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో సహాయం చేయడం సామాజిక బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. అలాగే ఇతర దాతలు, సహృదయులు కూడా ముందుకు వచ్చి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన దండు సరితా రాజు భవిష్యత్తులో గ్రామ సర్పంచ్‌గా (నాయకుడిగా) ఎదగాలని, ఇలాంటి యువ నాయకులకు తగిన అవకాశాలు రావాలని మమతా భూపతిరెడ్డి ఆకాంక్షించారు.



