ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం.
కార్పొరేటర్. ఫుర్ఖాన్ వెల్లడి.
విశ్వంభర, వరంగల్ జిల్లా:- 21 డివిజన్ ఎల్బీనగర్‌లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఎల్బీనగర్‌కు చెందిన పాశికంటి రాధికకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. 21 డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ ఫుర్ఖాన్ సహకారంతో పనులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.ఆగస్టులో మొదటి బిల్లు, సెప్టెంబర్ నెలలో రెండు, మూడవ బిల్లులు విడుదల చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు రూ.4 లక్షలు పాశికంటి రాధిక బ్యాంకు అకౌంట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జమ చేయడం జరిగింది. శుక్రవారం ఎల్బీనగర్‌లో రాధిక ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి కార్పొరేటర్ ఫుర్ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, కార్పొరేటర్ ఫుర్ఖాన్ ల సహకారంతో నిరుపేద కుటుంబానికి చెందిన మాకు సొంత ఇంటి కల సకారం అయిందని లబ్ధిదారులు పాశికంటి రాధిక రమేష్ దంపతులు ఆనందం వ్యక్తం చేయడంతోపాటు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేటర్ ఫుర్ఖాన్ కి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు, పాల్గొని శుభాకాంక్షలు వెలిబుచ్చారు.



