యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ

యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ

-    వైభవంగా ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ
-    అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

ప్రముఖ పున్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ ఇవాళ వైభవంగా ప్రారంభమైంది. లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున కొండకింద గాలిగోపురం వద్ద ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన భక్తులు శ్రీవారి మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకున్నారు. 

అయితే, రాష్ట్రంలో గిరి ప్రదక్షిణను ప్రవేశపెట్టిన మొదటి ఆలయంగా యాదగిరిగుట్ట దేవస్థానం నిలిచింది. స్థానిక భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా స్వామివారి ఆలయం చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.

Read More సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల