ఏకరూప పన్నులు అమలు చేయండి.- మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
- శివారు మున్సిపాలిటీలకు ఉచిత 20 వేల లీటర్ల మంచినీరు ఎప్పుడు ఇస్తారు?
- మాజీ మంత్రి, మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి.
విశ్వంభర, ఎల్బీనగర్ :-ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా డివిజనులను విభజించి చేతులు దులుపుకున్నారని, కాలనీల విభజన అస్తవ్యస్తంగా జరిగిందని , కొత్త గా ఏర్పాటైన డివిజన్లో ఏకరూప పన్నుల విధానాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.ఆర్.కె.పురం డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ అధ్యక్షతన గ్రీన్ హిల్స్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశానికి సబిత ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డివిజన్ల విభజన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం శివారు ప్రాంతాల కాలనీవాసులకు ఉచిత మంచినీరు ఎప్పుడు అందిస్తారని అన్నారు. ఉద్యమ కారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాను అని స్వార్ధం కోసం కేసీఆర్ ఎప్పుడూ పనిచేయాలేదు అని అన్నారు. కేసీఆర్ ను అవమానించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూన్నారని, దానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. డివిజన్ల విభజన సరిగా లేదని, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా బిఆర్ఎస్ గెలుపును కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని అన్నారు. ఎన్టీఆర్ నగర్ డివిజన్ ఏర్పాటు పట్ల తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇద్దరూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని డివిజన్ల విభజనలో కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందన్నారు. పన్నులు ఒకే విధంగా ఉండాలని అన్నారు. 20 వేల లీటర్ల నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పాను ఇచ్చిన మాట అమలు చేస్తాఅని, ఏమైనా బిఆర్ఎస్ గెలుపుతోనే కాంగ్రెస్ కు జవాబు చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని ధీమా వక్యం చేశారు. మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసే కాంగ్రెస్, బిజెపి ఇద్దరు శత్రువులను తరిమికొట్టాలన్నారు. ఎక్కువ మంది ఉద్యమకారులు ఉన్న డివిజన్ లో పార్టీ బలంగా ఉందన్నారు. అందరు కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, టికెట్ ఎవరికీ వచ్చిన పని చేసి బిఆర్ఎస్ జండా ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్, మాజీ ఎంపీపీ జిల్లెల కృష్ణారెడ్డి,మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీత రెడ్డి, ఊర్మిళారెడ్డి, రామాచారి, కొండ్రు శ్రీనివాస్, సాజీద్, రామ్ నరసింహగౌడ్, ఎన్. శ్రీనివాస్ రెడ్డి, ఎండి.జాహీద్, శ్యామ్ గుప్తా, యుగంధర్ శర్మ,
మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



