డిజిటల్ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి:: డీసీఎస్ఓ వెంకటేష్

డిజిటల్ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి:: డీసీఎస్ఓ వెంకటేష్

విశ్వంభర, నల్లగొండ:- డిజిటల్ వ్యవస్థ పనితీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డిసిఎస్ఓ టి.వెంకటేష్ కోరారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో  జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని "డిజిటల్ పాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విధానాల ద్వారా సామర్థ్యాలను పెంచి, కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేస్తూ డిజిటల్ న్యాయం అందించడం జరుగుతుందన్నారు. డిజిటల్ న్యాయం న్యాయ ప్రక్రియలను క్రమబద్దీకరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) మరియు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) వంటి వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుంటుందని వివరించారు. ఈ సాంకేతికతలు కేసు నిర్వహణ, చట్టపరమైన పరిశోధన, డాక్యుమెంటేషన్ ను ఆటోమేట్ చేయడంలో సహాయపడతాయని, కేసు పరిష్కారానికి అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొన్నారు. 

   సదస్సును ఉద్దేశించి లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, డ్రగ్ ఇన్ స్పెక్టర్ చిట్టిపోలు సంపత్ కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, క్యాట్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె వెంకటేశ్వర్లు, డీసీఐసీ కన్వీనర్ సీహెచ్. గురవయ్య, వినియోగదారుల సంఘాల నల్గొండ జిల్లా అధ్యక్షులు అన్నెబోయిన మట్టయ్య లు మాట్లాడుతూ డిజిటల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు మార్పులు వచ్చాయని వివరించారు. వస్తువు కొనుగోలు, సేవల్లో లోపాలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1915 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం కళాశాలలు, పాఠశాలల  విద్యార్థులకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. 

Read More మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. -వరంగల్ మేయర్ గుండు సుధారాణి. -ఘనంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ. - మహిళాశక్తిని చాటుతాం.. మహిళాభ్యున్నతికి కృషి చేస్తాం. - గుంటక రూప సదాశివ్ - మహిళా అధ్యక్షురాలు 

  ఈ కార్యక్రమంలో సహాయ పౌర సరఫరాల అధికారి ఎస్.రాజశేఖర్, శ్రీదేవి, డీ.రాము, వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట మనోహర్, జిల్లా కోశాధికారి కొప్పోలు విమలమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు అస్మా మహ్మద్, ఎండి. ముస్తాఫా, న్యాయవాది కట్టెకోల నరసింహారావు, జిల్లా సహాయ కార్యదర్శి తిరందాసు ఆంజనేయులు, పసునూరి రాంబాబు, ప్రచార కార్యదర్శి దువ్వ గీత, ఆర్గనైజింగ్ సెక్రటరీ అద్దంకి దశరథ, డివిజన్ కార్యదర్శులు పోలగాని వెంకటేశ్వర్లు, గండూరి నర్సింహ, రాపోలు శివకుమార్, జిల్లా నాయకులు జూలూరు వెంకటేశం, తాందారి యాదయ్య, వివిధ కళాశాలల పాఠశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: