గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

విశ్వంభర, తొర్రూరు : పల్లెల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వ అభివృధి పనులు చేపడుతుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తొర్రూరు మండలంలోని పలు గ్రామలలో సోమవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమలకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు రూ.5.07 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు  శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సంప్రదాయ పద్ధతిలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే స్థానికులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, సీసీ రోడ్లు, స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణం వంటి అంశాలపై గ్రామస్థులు వినతులు సమర్పించగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి కావాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. గ్రామాలభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని, ప్రభుత్వ పథకాలను అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్, వైస్ చైర్మన్ రాజశేఖర్,తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యానాయక్, తొర్రూరు మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి, తొర్రూర్ టౌన్ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-yashaswini-reddy-said-the-government-is-committed-to-village/article-19935

Tags: