పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ళు జైలు 

పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ళు జైలు 

విశ్వంభర, సిరిసిల్ల : పట్టణానికి చెందిన మైనర్ మూగ కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు వేముల శ్రీనివాస్ కి 10 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ రాజన్న సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వెలువరించారు.ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. బాధితురాలు 17 ఏళ్ల వయస్సు కలిగిన వినికిడి, మూగ వైకల్యం ఉన్న మైనర్ బాలిక. బాలిక తండ్రి చనిపోవడంతో తల్లి  శ్రీనివాస్‌ను వివాహం చేసుకుంది. అనంతరం నిందితుడు శ్రీనివాస్‌ బాలికను తరచూ లైంగికంగా వేధించడంతో ఆమె సిరిసిల్ల పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి, 10 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా రూ.30 వేల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు ఎస్‌ఐలు నాయుడు, శ్రవణ్, కానిస్టేబుల్ జనార్దన్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే అభినందించారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/accused-gets-10-years-in-jail-in-pocso-case/article-19352

Tags:  

Advertisement

LatestNews

ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు