బాలికను మోసం చేసిన నిందితుడి అరెస్ట్
On
విశ్వంభర, మహబూబాబాద్: ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి లోబరుచుకున్న నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, నిందితుడు చోరగుడి జోసెఫ్ (23) ములుగు జిల్లా గోవిందరావు పేట గ్రామంలో ఉంటున్నాడు. మహబూబాబాద్ కి వచ్చినప్పుడు బస్టాండ్ లో బాలికను పరిచయం చేసుకుని, ఫోన్ మాట్లాడుతూ ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకొన్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి తెలియపర్చగా బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, ఆదివారం నిందితున్ని అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.



