శ్రీ రాజ రాజేశ్వర ఆలయ హుండీ చోరీ
On
విశ్వంభర, చింతపల్లి : పురాతన శివాలయంలో గుర్తుతెలియని దుండగులు హుండీ చోరీకి పాల్పడిన సంఘటన చింతపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు స్థానిక శివాలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి సుమారు ఇరువై వేల రూపాయలు అపహరించినట్టు శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొమిరిశెట్టి వెంకటయ్య తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.



