అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
On
విశ్వంభర, మహబూబాబాద్ : మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బేతోలు గ్రామం భజన తండా కి చెందిన రైతు గుగులోతు విజయ్ ( 48 ) అప్పుల బాధతో ఆత్మహత్య కి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు మృతుడి భార్య బుజ్జి మాట్లాడుతూ, మూడు ఎకరాల్లో వేసిన మిర్చి , మొక్కజొన్న , పంట మంచిగా లేకపోవడంతో చేసేది ఏమీ లేక వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది పొలం వద్దనే ఉన్న చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు . మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు .



