ఢిల్లీ లిక్కర్ స్కాం: ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఛార్జిషీట్ 

ఢిల్లీ లిక్కర్ స్కాం: ఎమ్మెల్సీ కవితపై ఈడీ ఛార్జిషీట్ 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఇచ్చింది. ఆమెతో పాటు మరో నలుగురిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మే 29న తుది తీర్పు ఇవ్వనున్నట్లు తెలిపింది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలపై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను మే 28న విచారించాలని కోర్టు నిర్ణయించింది.
 
కాగా, ఈ కేసులో మొత్తం 8వేల పేజీలతో ఈడీ ఛార్జీషీట్ దాఖలుచేసింది. కేసులో కవిత ప్రమేయంపై ఛార్జిషీట్‌లో పలు ఆధారాలను ఈడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో కవితతో పాటు ఆరుగురు నిందితులపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. ఇండియా ఎహేడ్ ఉద్యోగి అరవింద్ ‌సింగ్ ఈ కేసులో ప్రధాన పాత్రధారి అని ఈడీ వాదనలు వినిపించింది.

అయితే, ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ప్రత్యేక కోర్టు విచారణ ముగిసింది. చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. మే 29న తీర్పు వెలువరించనుంది.

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో ఉపయోగం: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.