18న మెగా హెల్త్ క్యాంప్
On
- మెడికలాఫీసర్ డా.రమ్య
విశ్వంభర,నెల్లికుదురు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 18న,స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డా.రమ్య తెలిపారు. శుక్రవారం డా. రమ్య ఇక్కడ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ఆరుగురు స్పెషలిస్టు వైద్యులచే సంబంధిత శిబిరం ఉదయం 9: 30 నుంచి మధ్యాహ్నం 2:0 గం.ల వరకు జరుగుతుందని చెప్పారు. స్త్రీలు, పిల్లలు, ఎముకలు, కంటి,దంత, జనరల్ వైద్య నిపుణులు హాజరవుతున్న,దృష్ట్యా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన వివిధ డిసీజ్ లతో బాధపడుతున్న వారు హెల్త్ క్యాంపులో చేసుకుని ఉచిత మందులు పొంది సద్వినియోగం చేసుకోవాలని కోరారు.



