రిటైర్డ్ ఉద్యోగుల సేవలు అభినందనీయం 

రిటైర్డ్ ఉద్యోగుల సేవలు అభినందనీయం 

విశ్వంభర, నాగారం:  రిటైర్డ్ ఉద్యోగుల సేవలు అభినందనీయమని నాగారం మండల విద్యాధికారి వాసం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా మాజీ అధ్యక్షులు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి - అరుణ కుమారి దంపతుల మనవడు విక్రమ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బుధవారం నాగారం మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల
విద్యార్థులకు నోటు పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు.  వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి పాఠశాల,సమాజాభివృద్ధికి తోడ్పడాలని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని ఇష్టపడి చదువుకోవాలని అన్నారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మందడి పద్మా రెడ్డి, తిరుమలగిరి మండల శాఖ కార్యదర్శి బన్వరి నర్సయ్య, పందిరి సత్యనారాయణ, జయపాల్ రెడ్డి, రాంరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కె ఎల్ నర్సింహా రావు, జి యాదిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Tags: