ఒంగోలు హైవే-16 దిగ్బంధించిన పొగాకు రైతులు.. గిట్టుబాటు ధర కోసం ఆందోళన

  • పొగాకు రైతుల నిరసనతో హైవేపై ఉద్రిక్తత.. రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్.. ఒంగోలు జాతీయ రహదారిపై రైతుల బైఠాయింపు

Farmer Protest: పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారి-16పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో హైవేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తమ పంటకు సరైన ధర లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని శ్రీచైతన్య స్కూల్ బస్సులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర ప్రకటించాలని, పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.

Read More అమ్మ వడి కోసం అనంతపురం కలెక్టరేట్‌కు ఒంటరిగా వచ్చిన అనాథ బాలిక.

రైతుల ఆందోళన నేపథ్యంలో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆందోళనకారులు కోరుతున్నారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

ఒంగోలు హైవే-16 దిగ్బంధించిన పొగాకు రైతులు.. గిట్టుబాటు ధర కోసం ఆందోళన

Farmer Protest: పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారి-16పై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో హైవేపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తమ పంటకు సరైన ధర లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుని శ్రీచైతన్య స్కూల్ బస్సులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర ప్రకటించాలని, పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆందోళనకారులు కోరుతున్నారు.

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/ongolu-highway-16-blockade-tobacco-farmers-agitate-for-remunerative-price/article-20213

Tags: