8 ఏళ్ళైనా నష్ట పరిహారం లేదు
- కళ్యాణదుర్గం భూనిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి
- భూ నిర్వాసితుల తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
విశ్వంభర, కళ్యాణదుర్గం: 2018 లో జీడిపల్లి - బి.టి.పి - కుందుర్పి ఎత్తిపోతల పథకం పూర్తి కొరకు రైతుల నుంచి సుమారు 1400 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. కానీ నేటికీ అంటే 8 సంవత్సరాలు కావస్తున్న కుందుర్పి మండలంలోని తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా తీవ్ర ఆలస్యానికి నిరసిస్తూ మందలపల్లి, అప్పిలేపల్లి, బెస్తరపల్లి గ్రామ రైతులు, భూనిర్వాసితులు, ప్రజలు పాల్గొని తహసిల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్బంగా గౌరవ అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించుకోకుండా భూములు సేకరణ చేయడమే కాకుండా సేకరించిన భూముల్లో రైతుల అనుమతి లేకుండానే కాలువలు తవ్వడం అంటే ఏకంగా ప్రభుత్వమే భూములు కబ్జా చేయడమే. అలాగే నేటికీ కూడా నష్టపరిహారం చెల్లించకపోవడంతో తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా కూడా కృంగిపోవడం జరుగుతుంది. కనుక ప్రభుత్వం ఇకనైనా తక్షణమే భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.అలాగే భూనిర్వసితుల పోరాట కమిటీ ప్రధాన కార్యదర్శి సోమర రాహుల్ మాట్లాడుతూ రైతుల నుంచి భూసేకరణ చేసి దాదాపు దశాబ్దకాలం కావస్తున్న నష్టపరిహారం చెల్లించకపోవడం మరియు ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడం ప్రభుత్వాలు యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని మండిపడ్డారు. తక్షణమే భూ నిర్వాసితులకు నష్టపరిహరం మరియు ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీడిపల్లి బిటిపి కుందుర్పి కాలువలా భూనివార్వసితుల పోరాట కమిటీ సహాయ కార్యదర్శి పాలాక్షి, రాయలసీమ విద్యార్థులు వేదిక నాయకురాలు లక్ష్మి,అనంత హక్కుల పోరాట సంఘం నాయకులు రామాంజి మరియు రైతులు భూ నిర్వాసితులు గ్రామాల ప్రజలు పాల్గొని ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.