జగన్ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం పరిపాలనపై దృష్టి కేంద్రీకరిస్తూనే వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదని.. చచ్చేవరకూ కొట్టాలని టీడీపీ నేతలతో ఆయన సంభాషించడం చర్చనీయాంశమైంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ‘‘వైఎస్ జగన్‌కు అపారమైన జన, కుల బలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్‌గా ఉండే వారు.. చెప్పింది కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోండి..’’ అంటూ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదిలా ఉండగా నాగబాబు కూడా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ‘‘వైసీపీ కోరల్లో విషం మిగిలే ఉంది.. కూటమిపై విషప్రచారం చేసేవాళ్లను వదలం.. బీ కేర్‌ఫుల్..’’ అంటూ నాగబాబు హెచ్చరించారు.
జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు
— ఈశ్వర రెడ్డి (@eswarspeaks) June 14, 2024
అతనికి అపారమైన జన, కుల బలం ఉంది
తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండే వారు ఉన్నారు అంటూ తెలుగు దేశం పార్టీలో చర్చ pic.twitter.com/Hf8Qpsky0K