మైనర్ బాలిక మిస్సింగ్ కేసు ఛేదించిన రాప్తాడు పోలీసులు
- అదృశ్యమైన బాలిక సురక్షితం.. ముగ్గురు నిందితులు అరెస్ట్.
- పోక్సో కేసులో ముగ్గురికి రిమాండ్.. రాప్తాడు పోలీసుల కీలక విజయం.
Anantapur Minor Girl Missing case: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఈ నెల 10వ తేదీన పంగల్ రోడ్డులోని ఏపీ మోడల్ స్కూల్ సమీపం నుంచి అదృశ్యమైన మైనర్ బాలిక కేసును రాప్తాడు పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికను సురక్షితంగా గుర్తించి సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం కేసులో ప్రధాన నిందితుడు బి. మహేంద్ర నాయక్‌ను అరెస్టు చేశారు.
నిందితుడికి ఆశ్రయం కల్పించి, నేరానికి సహకరించిన వంశీ నాయక్, హరిజన కార్తీక్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
మైనర్ బాలికలను అక్రమంగా తీసుకెళ్లడం మాత్రమే కాకుండా, అలాంటి నేరాలకు సహకరించడం లేదా ఆశ్రయం కల్పించడం కూడా చట్టరీత్యా తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనల్లో పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.