జగన్ ఫొటో ఉన్నా పర్లేదు.. కిట్స్ పంపిణీ ఆపొద్దు : చంద్రబాబు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా స్కూల్ విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కానుక కిట్లపై జగన్ బొమ్మ ఉన్నా సరే వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారట. ఈ విషయాన్ని టీడీపీ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.
'బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృథా కాకూడదు. పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్‌ను అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. చెప్పిన మాట ప్రకారం కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవు. స్కూల్ పిల్లలకు ఇచ్చే కిట్‌పై జగన్ బొమ్మ ఉన్నా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ డబ్బులు వృధా కాకుండా చర్యలు ఉంటాయి' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ... జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను అలాగే పంపిణీ చేయమని ఆదేశించిన సీఎం చంద్రబాబు గారు.#TDP… pic.twitter.com/Q76iAcrbYN
— Telugu Desam Party (@JaiTDP) June 12, 2024