అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి.. సీపీఐ డిమాండ్

  • వర్షాభావంతో వేరుశనగ పంటలు ఎండిపోయాయని ఆవేదన.
  • రైతులకు ఎకరాకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి.

Chirutala Mallikarjuna: అనంతపురం జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నాయకత్వంలో సీపీఐ నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, రైతులను తక్షణమే ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని తెలిపారు. గత 55 రోజులుగా వర్షం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లాలో విస్తారంగా సాగు చేసిన వేరుశనగ పంటలు ఎండిపోవడంతో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారని పేర్కొన్నారు. వర్షాలపై ఆశతో ఎరువులు, విత్తనాల కోసం పెట్టుబడులు పెట్టిన రైతులు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు.

Read More కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్

తీవ్ర వర్షాభావంతో చెరువులు, కాలువలు, బోరుబావులు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, అనేక గ్రామాల్లో సాగునీటితో పాటు తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందన్నారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం, దాణా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేల పరిహారం, ఉద్యానవన పంటలకు ఎకరాకు రూ.1 లక్ష పరిహారం అందించాలని, ఎండిపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామాల్లో పశువులకు ఉచితంగా పశుగ్రాసం, తాగునీటి సదుపాయం కల్పించాలని, అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వీరనారప్ప, ఏ. సూర్యనారాయణ, నరసింహారెడ్డి, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/andhra-pradesh/cpi-demands-that-anantapur-be-declared-a-drought-district/article-20932

Tags:  

Advertisement

LatestNews

శ్రీ చైతన్యలో పుస్తకాల దందా.. 1వ తరగతి చిన్నారికి మెటా యాప్ పేరుతో వేల రూపాయల దోపిడీ..
ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి