శాంతియుత ఉద్యమాలతోనే హక్కుల సాధన: జస్టిస్ చంద్రకుమార్

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : శాంతియుత, ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారానే హక్కులు సాధించుకోవాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ మహిళా ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కేకే కమిటీ ఉద్యమకారులపై నివేదికను త్వరగా సమర్పించి, వారి సంక్షేమానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో కొంత భాగాన్ని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మహిళా ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ అంబు రాథోడ్, పోశాల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/justice-chandrakumar-to-pursue-rights-through-peaceful-movements/article-20917

Tags:  

Advertisement

LatestNews

ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు