నీట్ వ్యవహారంలో కేంద్రంపై విమర్శలు

నీట్ వ్యవహారంలో కేంద్రంపై విమర్శలు

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి అన్నారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ సాహితీ హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో "జెన్‌జీ విజయం – కవిత్వ మద్దతు" అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. ఆనందాచారి మాట్లాడుతూ నీట్ పరీక్ష వివాదంపై విద్యార్థుల ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రజాస్వామ్య నిరసనలను వక్రీకరించడం సరికాదన్నారు. ప్రముఖ కవి డా. కాసుల లింగారెడ్డి మాట్లాడుతూ నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శరత్ సుదర్శి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్.కె. సలీమ్, గంగాధర్, మహేష్ దుర్గే, రేఖారెడ్డి, శ్రీలత దావన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/criticism-of-the-center-in-the-neet-affair/article-20911

Tags: