ఆధ్యాత్మిక ఉత్సవాలతో గ్రామాలలో ఐక్యత పెరుగుతుంది

  •  ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి

విశ్వంభర, పెద్ద శంకరంపేట: గ్రామాలలో జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాల వల్ల ప్రజలలో భక్తి, ఐక్యత పెరగడానికి దోహదపడుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. ఆషాడ మాస బోనాలు సందర్భంగా  పెద్ద శంకరంపేట్ మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో  శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ఆదివారం బోనాల వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమo నిర్వహించగా  నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ , ఆషాఢ మాసంలో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, నియోజకవర్గ ప్రజలందరిపై కోటమ్మ తల్లి చల్లని చూపు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు, భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాల్లో ఐక్యత, భక్తిభావం పెంపొందించడానికి ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలోమండల కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ గౌడ్ స్థానిక  సర్పంచ్ పెరుమాళ్ గౌడ్ ప్రజాప్రతినిధులు, సంగమేశ్వర్ సెట్ మాణిక్య రెడ్డి కాశీరాం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు  పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/unity-in-villages-increases-with-spiritual-festivals/article-20846

Tags: