గోల్నాక ఎండోమెంట్ సెల్ సమన్వయకర్తగా భానుప్రకాష్

విశ్వంభర, బర్కత్‌పుర : భారతీయ జనతా పార్టీ అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ ఎండోమెంట్ సెల్ సమన్వయకర్తగా జి భానుప్రకాష్ నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాదు బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.నియామక పత్రం అందుకున్న జి భానుప్రకాష్ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, నగర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా గోల్నాక డివిజన్‌లో ఎండోమెంట్ సెల్‌ను బలోపేతం చేస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bhanuprakash-as-coordinator-of-golnaka-endowment-cell/article-20923

Tags: