రాజకీయాలకు అతీతంగా ధనుంజయకు నివాళులు

రాజకీయాలకు అతీతంగా ధనుంజయకు నివాళులు

విశ్వంభర, అంబర్ పేట: సమాజ సేవలో ముందుండి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఈ.ఎస్. ధనుంజయ మృతి సమాజానికి తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఈ.ఎస్. ధనుంజయ సంతాపార్థం ఆదివారం హైదరాబాదు అంబర్ పేట భరత్‌నగర్ కమ్యూనిటీ హాల్‌లో రాజకీయాలకు అతీతంగా సంతాప సభ నిర్వహించారు. అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, బస్తీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ధనుంజయ సమాజ సేవనే ధ్యేయంగా పనిచేశారని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను, సేవా స్ఫూర్తిని యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు. సభలో ధనుంజయ కుమారులు ఏడెల్లి వివేకవర్ధన్, ఏడెల్లి విశాల్ వర్ధన్తో పాటు మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్, డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, జి. ఆనంద్ గౌడ్, ఏడెల్లి అజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్లు ఆడప చంద్రమౌళి, వనం రమేష్ మహేందర్, ఏడెల్లి భానుప్రకాశ్, సీనియర్ పాత్రికేయుడు సతీష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tributes-to-dhanunjaya-beyond-politics/article-20903

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు