పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్లో జిల్లా నిరుద్యోగ యువతకు అన్యాయం

విశ్వంభర, రామన్నపేట: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రామన్నపేట 12వ మండల నిర్మాణ మహాసభ ఎర్ర రమేష్ అధ్యక్షతన ఆదివారం  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో జరిగింది. ఈ మహా సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏల్లంకి మహేష్, పేరబోయిన మహేందర్ మాట్లాడుతూ, జూలై 29న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో కోడ్ నెంబర్ 21 సివిల్ కానిస్టేబుల్, కోడ్ నెంబర్ 22 ఏఆర్ కానిస్టేబుల్ జాబితాలో యాదాద్రి భువనగిరి జిల్లా (ఖాళీలు) లేకపోవడం వల్ల జిల్లాకు సంబంధించిన నిరుద్యోగుల్లో ఆందోళన మొదలైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్  317 జీవో ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా, రాచకొండ పరిధిలో ఉండేదని, నల్గొండ, సూర్యాపేట ఇతర జిల్లాలకు చెందిన పలువురు కానిస్టేబుళ్లు యాదాద్రి జిల్లాలో విధులకు కేటాయించబడ్డారని, ఈ కేటాయింపు పారదర్శకంగా జరగలేదన్నారు. అనంతరం ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి యాదాద్రి భువనగిరి జిల్లాను రాచకొండ కమిషనరేట్ పరిధి నుండి వేరు చేసి 6నెలలు గడుస్తున్నప్పటికీ ఇతర జిల్లాలకు చెందిన కానిస్టేబుళ్ళను వారు సంబంధిత స్థానిక కేడర్లకు బదిలీ చేయక పోవడం వల్ల నల్లగొండ, సూర్యపేట జిల్లాలో గణనీయమైన ఖాళీలు ఏర్పడ్డాయి కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖాళీలు లేకుండా పోయిందని, జిల్లాకు చెందిన  నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. వెంటనే ఇతర జిల్లాల నుంచి వచ్చిన కానిస్టేబుళ్లను సంబంధిత స్థానిక కేడర్లకు బదిలీ చేసి వాస్తవిక ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ వెయ్యాలని ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువతపై జరిగిన లాఠీచార్జి ప్రజాస్వామ్యంపై దాడి అని సమగ్ర విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని కోరారు. విద్యా, వైద్యం ప్రవేటీకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 8,9,10 తేదీలలో యాదగిరిగుట్టలో జరిగే ఏఐవైఎఫ్ యువజన ప్రదర్శన బహిరంగ సభను విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నిర్మాణ మహాసభలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నయీం,‌ జిల్లా కోశాధికారి సాయి, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, పాండు, వీసం గాలయ్య, నాగరాజు, సంగిశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/injustice-to-the-unemployed-youth-of-the-district-in-police/article-20835

Tags: