మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

విశ్వంభర, మహేశ్వరం: ఆషాఢ మాసం సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదివారం మహేశ్వరం, తుక్కుగూడ, సర్దార్‌నగర్, మంకాల, అమీర్‌పేట్ గ్రామాల్లోని మహంకాళి అమ్మవారి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటల సమృద్ధితో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-sabitha-indra-reddy-participated-in-mahankali-bonala-celebrations/article-20883

Tags: