పట్నం రుక్కమ్మకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

  •  పట్నం కుటుంబాన్ని పరామర్శించిన ముఖ్యమంత్రి

విశ్వంభర, షాబాద్ : చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ దశదినకర్మ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరై ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొయినాబాద్ సమీపంలోని జేపీఎల్ కన్వెన్షన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి పట్నం సునీతమ్మను ఓదార్చిన ముఖ్యమంత్రి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని కూడా పలకరించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీలు వామన్ నరేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ గండి విట్టల్, మాజీ ఎమ్మెల్యే కేసీ రత్నం తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని పట్నం రుక్కమ్మకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cm-revanth-reddys-tribute-to-patnam-rukkamma/article-20841

Tags: