ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యలకు పరిష్కారం

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి, సమాన విద్యావకాశాలు కల్పించాలంటే ఉద్యమాలు అవసరమని విద్యావేత్తలు పేర్కొన్నారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్), పాలమూరు అధ్యయన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రొ. జి. హరగోపాల్ ప్రసంగాల సంకలనం 'సంక్షోభ కాలంలో విద్యారంగం' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రొ. కె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అందరికీ సమాన విద్య అందే విధానం అమలు కావాలని, కామన్ స్కూల్ విధానం అవసరమని అన్నారు. ప్రొ. వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాలుగా విద్యారంగం, సమాజంలో వచ్చిన మార్పులపై ప్రొ. హరగోపాల్ చేసిన విశ్లేషణలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి, విద్య ప్రైవేటీకరణను ఎదుర్కొనేందుకు ప్రజా ఉద్యమాలు కొనసాగాలని పిలుపునిచ్చారు. ఎం. సోమయ్య, ఎం. రాఘవాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొ. కె. చక్రధరరావు, ప్రొ. డి.ఎం. వెంకట్రములు, డా. ఎం. వనమాల, మెట్టు రవీందర్, గంగాధర్, రాజేంద్రబాబు, టి. లింగారెడ్డి, సి.హెచ్. అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-solution-to-the-problems-of-the-education-sector-is/article-20915

Tags: