#గాంధీ పార్క్ అభివృద్ధి చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33, 34వ వార్డులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఆదివారం సందర్శించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సాయిబాబా టెంపుల్ రోడ్డు, గాంధీ పార్క్, అంబేద్కర్ భవన్‌ను పరిశీలించి వాటి అభివృద్ధికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గాంధీ పార్క్‌ను ప్రజా సభలు, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువుగా అన్ని వసతులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే సాయిబాబా టెంపుల్ రోడ్డు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడటమే కాకుండా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసి అవసరమైన నిధులు విడుదల చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోతరాజు, పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మారినేని వెంకన్న, కౌన్సిలర్లు నర్రా సంధ్యా శ్రావణ్, ముత్యం వెంకన్న, సీపీఐ నాయకులు పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, భాను రవికుమార్, అజ్మీర వేణు, నీలం వెంకటేశ్వర్లు, బిక్కి సాయి, ఎడ్ల వేణు, మార్నింగ్ రఘు, జేరిపోతుల వెంకన్న, పుచ్చకాయల రామకృష్ణ, గోపి తదితరులు పాల్గొన్నారు.