చేనేత కళాకారుల శ్రమను గుర్తించి వేతనాలు పెంచాలి. - చేనేత కార్మిక సంఘం
మాస్టర్ వీవర్స్ అసోసియేషన్‌కు వినతిపత్రం
విశ్వంభర, చండూర్ : కరోనా సమయంలో తగ్గించిన చేనేత కార్మికుల కూలీలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు జూలూరు ఆంజనేయులు , గంజి యాదగిరి లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ, 2019లో వచ్చిన కరోనా మహమ్మారి సంక్షోభం కారణంగా మాస్టర్ వీవర్ల పరిస్థితిని అర్థం చేసుకుని, కార్మికులు తమ వేతనాల్లో (కూళ్లల్లో) కోతకు అంగీకరించారని గుర్తుచేశారు. అయితే, కరోనా కష్టకాలం ముగిసి ఐదేళ్లు గడుస్తున్నా మరియు నిత్యావసర వస్తువుల ధరలు, ఇంట్లో వాడే ప్రతి వస్తువు ఖర్చులు భారీగా పెరిగినా... ఇప్పటివరకు తగ్గించిన కూలీలను పెంచకపోవడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.అహర్నిశలు కష్టపడి అద్భుతమైన వస్త్రాలను నేసే చేనేత కళాకారులు నేడు పెరిగిన ద్రవ్యోల్బణంతో కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా మాస్టర్ వీవర్స్ స్పందించి, కళాకారుల శ్రమను గుర్తించి పెరిగిన ధరలకు అనుగుణంగా కూలి రేట్లను పునరుద్ధరించి, తగినంత వేతనం పెంచాలని కోరారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లపై మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ సానుకూలంగా స్పందించి తక్షణమే తగిన నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు రాపోలు వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం సభ్యులు తిరందాసు శ్రీనివాసులు, జూలూరు వెంకటేశం, బొల్ల జనార్ధన్, వర్కాల విజయ్ కుమార్, కర్నాటి శ్రీనివాసులు, గుర్రం రాము, చెరుపల్లి రాఘవేంద్ర, పద్మ పవన్ కుమార్, జూలూరు మల్లేష్,కలిమికొండ యాదయ్య మరియు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.