వైభవంగా నల్ల పోచమ్మ ఆలయ ఘటం ఊరేగింపు
విశ్వంభర, బషీర్ బాగ్ : నల్ల పోచమ్మ మహంకాళి ఆలయం 104వ వార్షిక బోనాల మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉమ్మడి బోనాల పూజ కమిటీ అధ్యక్షులు కట్ట లింగం ఆధ్వర్యంలో బ్రోచర్ ను ఆవిష్కరించారు. సబ్జిమండిలోని మహంకాళి, నల్ల పోచమ్మ ఆలయ ఘటం ఊరేగింపు వైభవంగా జరిగింది. టప్పాచబుత్ర, లోధ్ క్షత్రియనగర్ మలైమెట్ నటరాజ్ నగర్, అంబేద్కర్ నగర్ తదితర వీధుల గుండ సాగిన ఘటం ఊరేగింపునకు అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి బోనాల పూజ కమిటీ ప్రధాన కార్యదర్శి అల్లె రాంకుమార్, సలహాదారులు కట్ట రాజయ్య, సేనాపతి చంద్రశేఖర్, గూడబోయిన శివరత్నం, జలగరి వేణు, కట్ట శివరాజ్, బుర్ర వేణుకుమార్, కట్ట నర్సింగ్రావు, అవుశెట్టి శ్యామ్ సుందర్, గుడుమని అశోక్ కుమార్, గాండ్ల నిరంజన్ బాబు, ప్యాట నంద కిషోర్, దొర్తుల శ్రీనివాస్ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.