కళాకారులకు పుట్టినిల్లు ఓరుగల్లు
- సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత
- ఈగ మల్లేశంకు విశిష్ట కళాసేవా రత్న పురస్కారం
విశ్వంభర, హనుమకొండ: సకల కళలకు, కళాకా రులకు పుట్టినిల్లు ఓరుగల్లు అని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత అన్నారు. శనివారం రాత్రి హనుమకొండ లోని అంబేద్కర్భవన్లో గాన గాంధర్వుడు ఎస్సీ బాలసు బ్రహణ్యం, గాన కోకిల ఎస్. జానకి యాదిలో వరంగల్లోని సీనియర్ కళాకారులు ఐక్యతతో నిర్వహించిన ఓరుగల్లులో స్వరాభిషేకం ఆద్యంతం అలరించింది. తొలుత బాలసుబ్రహ్మణ్యం, జానకి చిత్రపటాలకు పుష్పా లంకరణ చేశారు. డీసీపీ దార కవిత, సెంట్రల్ ఖాదీ అండ్ స్మాల్స్కిల్ ఇండస్ట్రీ మాజీ డైరెక్టర్ ఈగ మల్లేశం, ఆర్యవైశ్య జాతీయ ఫెడరేషన్ నేత గట్టు మహేష్బాబు జ్యోతి ప్రజ్వ లన గావించి సంగీత విభావరిని ప్రారంభించారు. బాలు, జానకి ఆలపించిన మధురగీతాలను గాయకులు ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా డీసీపీ కవిత మాట్లాడుతూ... ఓరు గల్లు గడ్డపై ఎందరో కవులు, కళాకారులు పుట్టి అంతర్జా తీయ ఖ్యాతిని గడించారని కొనియాడారు. తనకు సంగీతం, పాటలు అంటే ఎంతో ఇష్టమని అన్నారు. ఎప్పుడు బిజీగా ఉండే తాను గాయకులు ప్రజల మధ్య సంగీత విభావరిని వినే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొ న్నారు. గట్టు మహేష్ బాబు మాట్లాడుతూ.. ఓరుగల్లు కళా కారులు అంతర్జాతీయ ఖ్యాతిని గడించారని అన్నారు. అనం తరం ఈగ మల్లేశం- సంగీత దంపతులకు విశిష్ట కళాసేవ రత్న పురస్కారాన్ని డీసీపీ కవిత చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఏసీపీలు జితేందర్రెడ్డి, కూజ విజయ్కుమార్, పోలీసు అధికారి రామారావు, వ్యాఖ్యాత హిమశ్రీ, ఆదర్శ లా కళాశాల అధినేత బూర విద్యాసాగర్, గాయకులు కాసర్ల శ్యామ్, పులి గణేష్, జనగాం రాము, చార్లెస్, చంద్రశేఖర్, కరుణాకర్, విజయ్కుమార్, సృజన్రావు, రజిత, కీర్తి,స్వర్ణ, స్వప్న, బిందు,రాధిక, మాధవి, కృష్ణవేణి, మధు, భిక్షపతి, బీఎస్. నందు, మధులత తదితరులు పాల్గొన్నారు.