మేడ్చల్ జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ గోనె శ్రీనివాస్

అవినీతి, అక్రమాలకు పాల్పడే  వారిని చట్టాలు కఠినంగా శిక్షించాలి

విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్  బోడుప్పల్ సర్కిల్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 389వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ గోనె శ్రీనివాస్, అడ్వకేట్ కిరణ్ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించి, భారత రాజ్యాంగ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గోనె శ్రీనివాస్ మాట్లాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా భారతీయులందరికీ సమానమైన హక్కులు కల్పించబడ్డాయని, నేడు రాజ్యాంగంలోని చట్టాలు కొందరికి చుట్టాలయ్యా యని, బడుగు, బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని, తన, మన తేడా లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి, అక్రమాలకు పాల్పడిన రాజకీయ నేతలను కఠినంగా శిక్షించాలని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని గోనె శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గరుగుల యాకయ్య, రాపోలు వెంకటేష్, సాయి బండారి,చిల్ల అంజయ్య, రామకృష్ణ, గల్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Read More సంస్కృతి కోల్పోతే తిరిగి సాధించలేం

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/medchal-district-bjp-general-secretary-gone-srinivas/article-20897

Tags:  

Advertisement

LatestNews

ఇయర్‌ఫోన్స్‌లో ఏకంగా 8 మైక్రోఫోన్లా? ఫీచర్లు చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే
అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక తనిఖీ
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు