ఘనంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 

ఘనంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం 

విశ్వంభర, పెద్ద శంకరంపేట: స్నేహం అనేది కేవలం ఒక బంధం కాదని, జీవితాంతం నిలిచే నమ్మకం, ప్రేమ, తోడ్పాటుకు ప్రతీక అని జిల్లా కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే సోదరుడు పి. సుధాకర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ స్నేహ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచవ్యాప్తంగా స్నేహ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. స్నేహితుల మధ్య ప్రేమ, విశ్వాసం, పరస్పర గౌరవం, సహకారం వంటి విలువలను గుర్తు చేసుకునే రోజే స్నేహ దినోత్సవమని అన్నారు. కష్టసుఖాల్లో అండగా నిలిచే బంధమే నిజమైన స్నేహమని, మంచి స్నేహితులు వ్యక్తిత్వ వికాసానికి, విజయానికి బలమైన ఆధారమని తెలిపారు. ఈ సందర్భంగా స్నేహితులందరికీ, వారి కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ స్నేహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్నేహ బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం స్నేహితులకు కేక్ తినిపించి, వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/happy-international-friends-day/article-20848

Tags: