ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్నేహబంధాల గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురళి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుధాకర్, కుమార్, ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకన్న, సంయుక్త కార్యదర్శి ఉపేందర్ చెన్నబోయిన, కోశాధికారి రాంబాబు, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పృధ్వీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల మధ్య స్నేహం, ఐక్యత, పరస్పర సహకారం సంఘం బలోపేతానికి ఎంతో అవసరమని అన్నారు. స్నేహస్ఫూర్తితో కలిసి పనిచేస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు విద్యారంగ అభివృద్ధికి మరింత కృషి చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో గట్టు అశోక్, సుభాన్, వినోద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ్యులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్నేహితుల దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.