హుస్నాబాద్ వైశ్య భవన్‌లో ఘనంగా గోరింటాకు వేడుకలు

విశ్వంభర, హుస్నాబాద్:  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్  పట్టణంలోని వైశ్య భవన్‌లో పట్టణ ఆర్యవైశ్య సంఘం, మహిళా విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు గోరింటాకు చెట్టు వద్దకు వెళ్లి ఆకులు తెంపుకొని సంప్రదాయ పద్ధతిలో నూరి, ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ జానపద గీతాలు పాడి ఆషాఢ మాస విశిష్టతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న గొప్ప సాంప్రదాయమని తెలిపారు. గోరింటాకు మహిళల అందాన్ని పెంచడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని అందించి, వర్షాకాలంలో వచ్చే చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు. కొత్తగా వివాహమైన మహిళలు, పెళ్లికాని యువతులు గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదంగా భావించే ఆనవాయితీని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ దండి లక్ష్మి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షురాలు మాడిశెట్టి హేమలత, రాష్ట్ర కార్యదర్శి నార్ల విజయలక్ష్మి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, కోశాధికారి బబ్బుల రవీందర్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి యాంసాని భాగ్యలక్ష్మి, కోశాధికారి గోగుల రాధిక, యువజన విభాగం నాయకుడు కుంభంపాటి సందీప్‌తో పాటు ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/husnabad-vysya-bhavan-grand-gourd-celebrations/article-20919

Tags: