హైడ్రాకు మద్దతుగా కాలనీ సంక్షేమ సంఘాలు

హైడ్రాకు మద్దతుగా కాలనీ సంక్షేమ సంఘాలు

విశ్వంభర, అమీర్‌పేట : "చెరువుల పరిరక్షణ, వరదల నివారణలో హైడ్రా చర్యలు కొనసాగించాలంటూ నగరంలోని పలు కాలనీ సంక్షేమ సంఘాలు ఆదివారం హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాయి. హైదరాబాదు మధురానగర్, శ్రీనివాస్‌నగర్, అమీర్‌పేట ప్రాంతాల్లో జరిగిన ర్యాలీల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, వరదల నివారణలో హైడ్రా చేపడుతున్న చర్యలను సంఘాల ప్రతినిధులు అభినందించారు. ఇటీవల హైడ్రాపై వస్తున్న ప్రతికూల ప్రచారాన్ని ఖండించిన వారు, హైడ్రా కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు. పర్యావరణహిత నగర నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కొనసాగించాలని, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ నాయకత్వంలో సంస్థ పనితీరు కొనసాగాలని కోరారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/colony-welfare-societies-in-support-of-hydra/article-20873

Tags: